
హైదరాబాద్: ఈ నెల ఆఖరి వరకు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు విడుదల
హైదరాబాద్: ఆదివారం జరిగిన సమావేశంలో ఈనెల ఆఖరి వరకు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు విడుదల చేస్తామని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. కష్టపడి పని చేసిన కార్యకర్తలు అందరికీ న్యాయం జరుగుతుందని స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాలు విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.