ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ మ్యాచ్ చూస్తున్న మహ్మద్ కైఫ్ (18) ఓ బాలుడు సరదాగా కాల్చిన తుపాకీ గుండు తగిలి మృతి చెందాడు. శనివారం రాత్రి 13 ఏళ్ల బాలుడు క్రికెట్ చూస్తుండగా.. పొరుగింట్లో ఉన్న మహ్మద్ కైఫ్ కూడా వచ్చాడు. బాలుడు తన తండ్రి లైసెన్స్‌డ్ తుపాకీ తీసుకొచ్చి సరదాగా కైఫ్‌కు గురి పెట్టాడు. ట్రిగ్గర్ నొక్కగానే బుల్లెటు మహ్మద్ తలలోకి దూసుకెళ్లింది. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.