తమ సమస్యలను పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేసిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మండిపడ్డారు. వారి అరెస్టులను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని టెక్నాలజీ కళాశాల కాంట్రాక్టు అధ్యాపకులు క్లాసులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. తమను రెగ్యులరైజ్ చేయాలని అన్ని ప్రభుత్వాలను విన్నవించుకున్నామని తెలిపారు.