రాష్ట్రంలో 12 యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకి ఉద్యోగ భద్రత కల్పించాలని మంగళవారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఉస్మానియా యూనివర్సిటీలో తరగతులు బహిష్కరించి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ముందు వారి యొక్క నిరసన తెలియజేయడం జరిగింది. డాక్టర్ విజేందర్ రెడ్డి, డాక్టర్ ధర్మతేజ మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ భద్రతతో కూడిన స్కేల్ ఇవ్వాలని లేనిపక్షంలో ఉద్యమాలు ఉదృతం చేస్తామని అన్నారు.