కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల అక్రమ అరెస్టులను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 12 యూనివర్సిటీల బందుకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఓయూ అర్ట్స్ కాలేజ్ నుండి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జీఓ 21రద్దు చేసి తమను రెగ్యులర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు.