AP: విశాఖ జిల్లా భీమిలి సముద్రంలో స్నానం చేస్తుండగా ఓ వ్యక్తికి గుండెపోటు వచ్చింది. స్థానికులు అప్రమత్తమై అంబులెన్స్, భీమిలి పోలీసులకు సమాచారమిచ్చారు. అతడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గుండెపోటుకు గురైన వ్యక్తి వెస్ట్ బెంగాల్‌కు చెందిన షేక్ హాఫిజుల్ రెహమాన్ (67)గా గుర్తించారు. ప్రస్తుతం రెహమాన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.