దార్షానికుల జయంతి ఉత్సవాలలో భాగంగా శనివారం ఓయూ కాన్ఫరెన్స్ హాల్లో "ఇంక్లూజ్ ఫ్రేమ్ వర్క్ మెథడాలజీస్ ఫర్ సోషల్ జస్టిస్ అనే అంశంపై వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఎం కుమార్ హాజరై, మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్, మహాత్మ జ్యోతిబాపూలే, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ల మహోన్నతమైన త్యాగాలు రేపటి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయని అన్నారు.