భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘భూభారతి’ చట్టం నేటి నుంచి అమల్లోకి రానుంది. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు ధరణిలో జరిగిన వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఇకపై భూభారతిలో జరగనున్నాయి. తొలుత ఈ చట్టాన్ని తిరుమలగిరి సాగర్, కీసర, సదాశివపేట మండలాల్లో అమలు చేయనుంది. ఇక్కడ ఎదురైన సమస్యలను పరిష్కరించి రాష్ట్రమంతటా అమలు చేయనుంది.