AP: విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలంలో దారుణం చోటు చేసుకుంది. జనసేన నేత ధనుంజయ్‌పై హత్యాయత్నం జరిగింది. గతంలో ప్రభుత్వ ఆస్పత్రి స్థలం కబ్జాపై ధనుంజయ్ పోరాటం చేశారు. ఈ విషయంపై హైకోర్టులోనూ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అక్కు నాయుడు అనే వ్యక్తి ధనుంజయ్‌పై కత్తితో దాడి చేశాడు. స్థానికులు ధనుంజయ్‌ను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.