కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల అక్రమ అరెస్టులను ఖండిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 యూనివర్సిటీలలో బందుకు పిలుపునిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం తమకు అనుకూలంగా ప్రకటన ఇవ్వని పక్షంలో 12 యూనివర్సిటీలను స్తంభింపచేస్తామని హెచ్చరించారు. తక్షణమే జీవో నంబర్ 21ను రద్దు చేయాలని బుధవారం డిమాండ్ చేసింది.