ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు మల్లాపూర్ లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం కల్గించి, రాజ్యాంగ విలువల పట్ల అవగాహన పెంచే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టబడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ కోర్డినేటర్ సింగిరెడ్డి ధనపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.