రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీవో నంబర్ 21ను రద్దు చేసి అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు బేసిక్, డీఎ, హెచ్ఆర్ఏ, 3 శాతం ఇంక్రిమెంట్ తో కూడిన స్కేల్ ను అమలు చేయాలని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీలోని భారీ ర్యాలీ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు.