తెలంగాణలోని 12 యూనివర్సిటీలో పనిచేస్తున్న పార్ట్ టైమ్ అధ్యాపకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 17వ తేదీన చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నట్టు ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు అసోసియేషన్ నాయకులు డాక్టర్ సోమేశ్వర్, డాక్టర్ జానకి రెడ్డి, డాక్టర్ వరలక్ష్మి పత్రికా సమావేశాన్ని శుక్రవారం ఆర్ట్స్ కాలేజ్ ముందు నిర్వహించారు.