
కరీమాబాద్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టివేత
ట్రేడ్ లైసెన్స్ లేకుండా తయారు చేస్తున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉత్పత్తులను వరంగల్ కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటలో శనివారం టాస్క్ ఫోర్స్, జీడబ్ల్యూఎంసీ అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ విలువ 1. 52 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ను బల్దియా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో టాస్క్ ఫోర్స్, వరంగల్ మహా నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.