
హన్మకొండలో చెడ్డీ గ్యాంగ్ బీభత్సం
హన్మకొండలో చెడ్డీ గ్యాంగ్ బీభత్సం సృష్టించింది. బుధవారం రాత్రి హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనానికి పాల్పడింది. ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. సీసీ కెమెరాల్లో లభించిన వీడియో ఆధారంగా వరంగల్లోకి చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించినట్లు గుర్తించారు. ఈ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. నగరంలోని లాడ్జీలు, హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ముఠాలో ఉన్న ఆరుగురిపై టాటూలు గుర్తించారు.