అభిషేక్ శర్మ బ్లాస్టింగ్ సెంచరీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. 246 పరుగుల భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ 18.3 ఓవర్లలో 247/2తో ఛేదించింది. అభిషేక్ శర్మ కేవలం 55 బంతుల్లోనే 141 పరుగులు (14 ఫోర్లు, 10 సిక్సర్లు) బాదుతూ ఐపీఎల్‌లో భారత బ్యాటర్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత SRHకు ఈ గెలుపు ఊపిరి తీసుకొచ్చింది.