పవన్ కళ్యాణ్ దంపతులు మార్క్ శంకర్‌తో శనివారం ఇండియాకి తిరిగొచ్చారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో పవన్ కళ్యాణ్ మార్క్ శంకర్ ఎత్తుకుని వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల సింగపూర్ స్కూల్ అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. సింగపూర్‌లోని స్కూల్‌లో జరిగిన ఈ ప్రమాదంలో మార్క్ చేతులకు, కాళ్లకు చిన్నపాటి గాయాలయ్యాయి.