వరంగల్ లోని నిరుద్యోగులకు ప్రయివేటు రంగంలో ఉద్యోగం కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహించిన జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ అయిందని వరంగల్ (తూర్పు) ఎమ్మేల్యే, మంత్రి కొండా సురేఖ శుక్రవారం రాత్రి హర్షం వ్యక్తం చేశారు. జాబ్ మేళాకు 23 వేల మంది హజరు కాగా 5631 మందికి నియామక పత్రాలు అందచేయడం తనకు అత్యంత సంతోషం కలిగించిందని జాబ్ మేళా విజయవంతం అయ్యిందని అని మంత్రి సురేఖ అన్నారు.