
వరంగల్: ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి యువకుడి మృతి
వరంగల్ ఏసీరెడ్డి నగర్ కు చెందిన పెరుమాళ్ల అనిల్ ప్రమాదవశాత్తు రైల్లో నుంచి జారిపడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కూలి పని కోసం రామగుండం వెళ్లేందుకు కోర్బా ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తూ పాత రైల్వే గేట్ ప్రాంతంలో జారి పడడంతో తలకు గాయాలయ్యాయి. చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి అక్కడి నుంచి హైదరాబాద్లోని వెల్నెస్ హాస్పిటల్కు తరలించగా బుధవారం సాయంత్రం చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు.