వరంగల్ జిల్లా 35వ డివిజన్ పుప్పాల గుట్ట ప్రాంతంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు వైట్ల గణేష్ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా గురువారం నిర్వహించారు. గంట రవికుమార్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ నాకు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు.