రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం వరంగల్ నగరంలోని 12వ డివిజన్ దేశాయ్ పేటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పథకంలో భాగంగా లబ్ధిదారుడు ఇంటికి వెళ్లారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి ప్రజలు మోసం చేసిందని అన్నారు. కేటీఆర్, కేసీఆర్ ప్రజలను మోసం చేశారన్నారు.