ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం వరంగల్ కే ఎం సి నుండి ఎంజీఎం హాస్పిటల్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఎంజీఎం సూపరింటెండెంట్, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు. దేశ భవిష్యత్తు కోసం ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేస్తామంటూ వైద్య విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేసారు. ఆరోగ్యమే మహాభాగ్యం, మంచి ఆహారం మంచి ఆరోగ్యం, ఆరోగ్య తెలంగాణ నిర్మిద్దాం అంటూ నినాదాలు చేశారు.