వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలో మంగళ వారం మేయర్ గుండు సుధారాణి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ ఛాంబర్ కింది వైపున గల సెల్లార్ ఏరియాతో పాటు కార్యాలయంలోని ఇన్ వార్డ్ కంట్రోల్ రూమ్, ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్, జనన, మరణ ధృవీకరణ సెక్షన్, పెన్షన్ సెక్షన్, అకౌంట్స్ సెక్షన్ లలో పర్యటించి జాబ్ నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. మేయర్ ఛాంబర్ ఉన్న సెలార్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు.