SRHvsPBKS మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాళ్లైన ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ మధ్య వివాదం తలెత్తింది. 9వ ఓవర్‌లో హెడ్ వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. అనంతరం బంతిని మిస్సైనప్పటికీ, క్రీజులో ఉన్న హెడ్‌పై మ్యాక్స్‌వెల్ బంతిని విసరడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఓవర్ అనంతరం ఇద్దరూ మాటల తూటాలు పేల్చుకున్నారు. స్టొయినిస్ మధ్యలోకి రావడంతో అతనితోనూ వాగ్వాదం జరగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరలవుతున్నాయి.