వరంగల్ నగరం 42వ డివిజన్ రంగశాయిపేటలోని శ్రీ సీతారాచంద్రస్వామి దేవస్థానంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు పురస్కరించారు. 5వ రోజు సందర్భంగా బుధవారం శేష వాహనంపై శ్రీ సీతారాచంద్రస్వామి వారినీ సాగర వీధి నుండి మేరవాడ శివాలయం కోమటివాడ, పోచమ్మ ఆలయం, కురుమవాడ, దొరవారి ఇంటి నుండి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకురావడం జరిగింది. ఇట్టి ఊరేగింపు కార్యక్రమంలో భక్తులు స్వామి వారికి మంగళహారతులతో, కోలాటం ఆట పాటలతో ఆహ్వానం పలికారు.