
శిల్పకళా సంపద అద్భుతం: వరంగల్ సీపీ
కాకతీయ సామ్రాజ్యమైన ఓరుగల్లు కోటను శుక్రవారం సాయంత్రం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులు తిలకించారు. కళాఖండాలను, వాటి చరిత్రను పర్యాటకశాఖ గైడ్ రవి యాదవ్ వారికి వివరించారు. కళా తోరణాల మధ్యలో ఉన్న శిల్పకళా సంపదను చూసి అద్భుతం అని కొనియాడారు. కుష్మహల్, ఏకశిలకొండ, స్వయంభు దేవాలయం, శృంగారపు బావి, అనంతరం సౌండ్ అండ్ లైట్ షో తిలకించారు.