మద్యం సేవించి వాహనం నడపడం నేరమని, వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని శనివారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. వాహనదారులు మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా పత్యక్షంగా గాని, పరోక్షంగా గాని రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారకులు కావడంతో కొన్ని సందర్భాల్లో సదరు మద్యం సేవించి వాహనదారుడు సైతం రోడ్డు ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. తద్వారా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు.