తెలంగాణలో టీచర్ కొలువు కోసం బీఎడ్, డీఈడీ పూర్తి చేసిన 16 లక్షల మంది ఎదురుచూస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య సీఎం రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. దీంతో ఖాళీగా ఉన్న 30 వేల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరిపిన నియామకాలలో నాన్ జాయినింగ్ పెద్ద ఎత్తున ఉండటంతో ఖాళీలు మిగిలిపోయాయన్నారు. అన్ని ఉపాధ్యాయ పోస్టులకు ఒకే నోటిఫికేషన్ అనే నిబంధనలు మార్చాలన్నారు.