60 కంపెనీల ద్వారా 11 వేల మంది నిరుద్యోగ యువతకు జాబ్ మేళా ద్వారా ఉద్యోగం కల్పిస్తున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం వరంగల్ నగరంలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో కొండా దంపతులు నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఎన్నికల ముందు చెప్పిన విధంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన విధంగా జాబ్ మేళా ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.