
చింతలమానేపల్లి: కారు బీభత్సం ఇద్దరికీ గాయాలు
ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం రుద్రాపూర్ గ్రామంలో కారు భీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన కూర్చొని ఉన్న తండ్రి, 7 సంవత్సరాల కుమారుడు పైకి దూసుకెళ్లింది. ఫుల్ స్పీడ్ గా వచ్చిన కారు అదుపుతప్పి వారిని తాకడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఆగకుండా తరుముకొని వెళ్ళిన కారు డ్రైవర్. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.