తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం స్వాగతిస్తున్నామని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు అన్నారు. సర్కార్ పంపిణీ చేసిన సన్న బియ్యం భోజనాన్ని సోమవారం ఎమ్మెల్సీ దండే విట్టల్, అధికారులతో కలిసి తిన్నారు. ఆయన మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ పేదలకు వరంలా మారిందన్నారు. దీనికి కేంద్రం 80 శాతం నిధులు ఇస్తుందని, బియ్యం దళారులకు విక్రయించకుండా వినియోగంలోకి తీసుకోవాలని అన్నారు.