కాగజ్‌నగర్ పట్టణంలో శనివారం పాత హనుమాన్ ఆలయం వద్ద హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. బాహుబలి హనుమాన్, అఘోరాలు, శివుని వేషధారణలతో అందరిని ఆకర్షించారు. డీజే పాటలతో, బ్యాండ్ ప్రదర్శనలతో జైశ్రీరామ్ నినాదాలతో పట్టణమంతా మార్మోగిపోయింది. పట్టణమంతా కాషాయమయంగా మారింది. దాదాపు 15 మండలాల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకోవడం విశేషం. భక్తులంతా రామనామ స్మరణలో మునిగితేలారు.