
కొమురంభీం: గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ కొరకు సర్వం సిద్ధం
కొమురంభీం జిల్లాలో ఈ నెల 15, 16 తేదీలలో జరగనున్న గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ కొరకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం కాగజ్నగర్ పట్టణంలోని సెయింట్ క్లారెట్ పాఠశాలలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రాన్ని సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా తో కలిసి పరిశీలించి మాట్లాడారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.