కాగజ్‌నగర్‌లో ఈనెల 14వ తేదీన నిర్వహించనున్న అంబేడ్కర్ జయంతి ఉత్సవాలకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. శనివారం వారి నివాసంలో కలిసి ఆహ్వానపత్రికను అందించగా, జయంతి వేడుకల కోసం తన వంతుగా రూ. 20 వేలు ఆర్థిక సాయాన్ని ఆర్ఎస్పీ అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.