కాగజ్‌నగర్ మండలంలోని సర్సిల్క్ కాలనీలోని శ్రీ రామ్ మందిర్ లో శ్రీ రామనవమి సందర్భంగా ఆదివారం పునర్వసు నక్షత్రయుక్త అభిజిత్ లగ్న పుష్కరాంశ సుముహూర్తమున గోరంట్ల అరుణ్ కుమార్. సంజయ్ మొదాని వారి ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణంలో భక్తులు, ఆంజనేయ స్వాములు, ఆలయ కమిటీ సభ్యులు విచ్చేసి కళ్యాణాన్ని తిలకించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.