కాగజ్‌నగర్‌ లో ఘనంగా హనుమాన్ స్వాముల శోభాయాత్ర

83பார்த்தது
కాగజ్‌నగర్‌ పట్టణంలోని సర్ సిల్క్ రామ మందిరం నుంచి సోమవారం రాత్రి హనుమాన్ స్వాముల శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా మండలంలోని ఆంజనేయ స్వామి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ శోభాయాత్రలో మహిళా భక్తులు దీపారాధనలతో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు పాల్గొని మాట్లాడారు. ఆంజనేయస్వామి మాలధారణతో ప్రతిఒక్కరిపై గౌరవం పెరుగుతుందని భక్తి మార్గంలోనే శాంతి ఉందన్నారు.

தொடர்புடைய செய்தி