కాగజ్‌నగర్: రూట్ మ్యాప్ పరిశీలించిన సీఐ, కమిషనర్

65பார்த்தது
కాగజ్‌నగర్ పట్టణంలో ఈనెల 12 శనివారం సాయంత్రం 4.00 గంటలకు హిందూ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో శ్రీ వీర హనుమాన్‌ శోభాయాత్రను ఘనంగా నిర్వహించ తలపెట్టారు. ‌‌కాగా గురువారం శోభాయాత్ర రూట్ మ్యాప్‌ను కాగజ్‌నగర్‌ టౌన్ సీఐ పీ. రాజేంద్రప్రసాద్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య పరిశీలించారు. శోభాయాత్ర రూట్‌లో బందోబస్తు ఏర్పాటు చేస్తామని సీఐ తెలిపారు. సానిటైజేషన్ పనులు పూర్తి చేయిస్తామని కమిషనర్ పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி