కాగజ్‌నగర్ పట్టణంలోని రైల్వే కాలనీలో గల రామాలయంలో సోమవారం రాత్రి శ్రీసీతారామచంద్రునికి పట్టాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేదపండితులు కమలాకర్ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వెండి కిరిటాలను దంపతులచే మూడుసార్లు ఆలయం చుట్టూ తిరిగి రాములవారికి లక్ష్మణునికి సీతమ్మకు కిరిటాలను తొడిగారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.