కాగజ్‌నగర్ మండలం ఊట్పల్లిలో సోమవారం సన్న బియ్యం లబ్ధిదారుడైన గిరిజనుడైన మర్సకోల లింగు ఇంట్లో సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్ భోజనం చేయడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ రేషన్ కార్డు లబ్ధిదారులందరూ సన్న బియ్యం పథకాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. సన్నబియ్యం పథకానికి కేంద్ర ప్రభుత్వం 80 శాతం నిధులుస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం నిధులు కలుపుతుందని తెలిపారు.