కాగజ్‌నగర్ మండలం చారిగాం రోడ్డు, ఎన్జీఓస్ కాలనీ, డాడా నగర్ గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద సిమెంటు రోడ్లను రూ. 30 లక్షల వ్యయంతో నిర్మించడం జరిగింది. సోమవారం సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు ఈ సిమెంట్ రోడ్లకు కొబ్బరి కాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ. 10 కోట్ల అంచనాతో నియోజకవర్గ వ్యాప్తంగా పనులు పూర్తి కావచ్చే దశలో ఉన్నాయని తెలిపారు.