కాగజ్ నగర్ మండలంలోని సర్సిల్క్ కాలనీలో శ్రీ రామ్ మందిర్ లో రేపు శ్రీ రామ నవమి సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంllరll చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రయుక్త అభిజిత్ లగ్న పుష్కరాంశ సుముహూర్తమున శ్రీ సీతా రామచంద్రస్వామి కళ్యాణం జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి కళ్యాణాన్ని తిలకించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా శనివారం శ్రీ రామ్ మందిర్ కమిటీ సభ్యులు కోరారు.