

ఆసిఫాబాద్: ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆసిఫాబాద్ కేంద్రంలో (భోగ్ బండర్) ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ ర్యాలీగా బయలుదేరి జెండా ఆవిష్కరించారు. అనంతరం బంజారా మహిళలు తీజ్ బట్టలు ఎత్తుకొని బంజారా వేషధారణలతో నృత్యం చేసి ఆకట్టుకున్నారు.