
కాగజ్నగర్: భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోం
టైగర్ కారిడార్ పేరిట గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తూ భూములను లాక్కుంటామంటే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ మండల కన్వీనర్ నాగపూరి బండి పటేల్ పేర్కొన్నారు. మంగళవారం కాగజ్నగర్ మండలం నందిగూడ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని హక్కులు కలిగి ఉన్న గ్రామస్తులకు బీఆర్ఎస్ అండగా ఉండి పోరాటం చేస్తుందన్నారు. ఫారెస్ట్ అధికారులు గ్రామస్థులను భయాందోళనకు గురిచేయొద్దని అన్నారు.