బావిలో పడి వృద్ధురాలు ఆత్మహత్య
హాజీపూర్ మండలంలోని దొనబండకు చెందిన గుండవీని బూదమ్మ (60) వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతూ తీవ్ర మనస్థాపానికి గురై ఇంటి ఆవరణలోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సురేష్ గురువారం తెలిపారు. గత రెండేళ్లుగా ఆమె క్యాన్సర్ తో బాధపడుతుంది. పలు ఆసుపత్రిలకు వైద్యం కోసం తిరిగినప్పటికీ వ్యాధి నయం కాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై పేర్కొన్నారు.