కార్మికుడి మృతిని గని ప్రమాదంగా పరిగణించాలి
సింగరేణి యాజమాన్యానికి బొగ్గు ఉత్పత్తిపై ఉన్న ఆరాటం కార్మికుల ప్రాణాలపై లేదని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జైపాల్ సింగ్ ఆరోపించారు. బుధవారం మంచిర్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇందారం 1ఏ గనిలో శ్రీనివాస్ అనే కార్మికుడు ఊపిరాడక మృతి చెందాడని తెలిపారు. కార్మికుడి మృతిని గని ప్రమాదంగా పరిగణించి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.