కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద కళ్ళకు నల్ల గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉద్యోగాల కల్పనలో బీసీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని ఆరోపించారు.