
స్టేషన్ ఘనపూర్: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పర్వదినం సందర్బంగా ముస్లిం సోదర సోదరిమణులకు సోమవారం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందని తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు ఆధ్మాత్మికతను, క్రమశిక్షణను పెంపొందిస్తాయని అన్నారు.