కేకేఆర్‌పై ముంబై ఘన విజయం

1552பார்த்தது
కేకేఆర్‌పై ముంబై ఘన విజయం
IPL-2025లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ ఘన విజయం సాధించింది. KKR ఇచ్చిన 117 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు 2 వికెట్లు కోల్పోయి 12.5 ఓవర్లలో ఛేదించింది. ముంబై బ్యాటర్లలో ర్యాన్ రికెల్టన్ (62) హాఫ్ సెంచరీతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రస్సెల్ రెండు వికెట్లు తీశారు. దీంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో బోణీ కొట్టింది.

தொடர்புடைய செய்தி