తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేసాయి. దీంతో 10 గంటలు దాటితే బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మరో హెచ్చరిక జారీ చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలో హీట్ వేవ్ ఉంటుందని తెలిపింది. అంతేగాక మధ్య, తూర్పు భారతదేశం, వాయువ్య మైదానాలతో వేడి గాలులు వీస్తాయని పేర్కొంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.