వివిధ సమయాల్లో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న పలువురు ఇటీవల స్థానిక భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భముగా సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 16 మంది ఫోన్లు రికవరీ చేసి గురువారం బాధితులకు అందజేశారు. సీఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు తమ సెల్ ఫోన్లు పోగొట్టుకున్నట్లయితే వెంటనే ఫిర్యాదు చేస్తే సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పట్టుకోవడం జరుగుతుందని, ఈ సాంకేతికతను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.